గణేశ్ ఊరేగింపులో రోడ్డుపై చిందేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. వీడియో వైరల్!

షార్ట్స్‌లో చూడండి
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ లో తొలి సక్సెస్ సాధించింది. తాజాగా గణేశ్ ఉత్సవాల సందర్భంగా పాయల్ రాజ్ పుత్ సంబరాల్లో పాల్గొంది. ఈ ఊరేగింపులో స్నేహితులతో కలిసి ఆమె సంతోషంతో చిందేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ ఊరేగింపు ఎక్కడ జరిగిందన్న విషయమై ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ ‘ఆర్డీఎక్స్ లవ్’ అనే రొమాంటిక్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను శంకర్ భాను తెరకెక్కిస్తుండగా, రాధన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాను ఈ నెలలోనే విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.
Go Back to Shorts
Payal rajput
Ganesh
Ganesh Chaturthi celebrations
Tollywood heroine
RX100 movie
RDX Love

More Telugu News