మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ.. తొలిసారిగా ఇద్దరు మహిళలకు చోటు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ.. తొలిసారిగా ఇద్దరు మహిళలకు చోటు!

  • ఆరుగురు కొత్త మంత్రులు కేటీఆర్, హరీశ్, పువ్వాడ, గంగుల, సబితా, సత్యవతికి చోటు
  • గవర్నర్ సమక్షంలో కాసేపట్లో ప్రమాణస్వీకారం 
  • కొత్త మంత్రులకు ఇప్పటికే ఫోన్ చేసిన కేసీఆర్
మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. ఇందుకు సంబంధించిన జాబితాను గవర్నర్ కు సీఎం కేసీఆర్ అందజేశారు. కాసేపట్లో ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కు కేసీఆర్ ఇప్పటికే ఫోన్లు చేశారు. తెలంగాణ కేబినెట్ లోకి తొలిసారిగా ఇద్దరు మహిళలకు చోటు దక్కినట్టు సమాచారం.

కాగా, టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తర్వాత కేబినెట్ విస్తరణ జరగనుంది. కొత్త మంత్రులతో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.  
Telangana
cabinet
KTR
Harish rao
Sabitha

More Telugu News