Andhra Pradesh: నాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపనలో పార్టీపై దృష్టి పెట్టలేదు: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
నాడు ఏపీని అభివృద్ధి చేయాలన్న తపనలో పార్టీపై సరిగా దృష్టి పెట్టలేదని చంద్రబాబునాయుడు అన్నారు. తమ కార్యకర్తల్లో కసి చూస్తుంటే ఇన్నేళ్లూ ఏం కోల్పోయామో తెలిసిందని చెప్పారు. తన హయాంలో ప్రభుత్వాన్ని నెంబర్ వన్ చేసిన తనకు పార్టీనీ అలా చేయడం పెద్దకష్టం కాదని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ వందరోజుల పాలనపై విమర్శలు గుప్పించారు. ఏపీలో ఒక నగరం నుంచి మరో నగరానికి విమానంలో వెళ్లే పరిస్థితి లేదని విమర్శించారు. అమరావతి నుంచి విశాఖ, తిరుపతి వెళ్లాలంటే హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
Chandrababu
Amaravathi

More Telugu News