కాలిఫోర్నియా బోటు ప్రమాదం.. 20 మృతదేహాల వెలికితీత
- సోమవారం కాలిఫోర్నియా తీరంలో తగలబడిన పడవ
- నీటిలో పడవ శిథిలాల కింద మరో ఆరు మృతదేహాలు
- డీఎన్ఏ పరీక్ష అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగింత
గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికి తీశారు. మరో నాలుగు నుంచి ఆరు మృతదేహాలు నీటిలో బోటు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటాయని భావిస్తున్నారు. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించిన అనంతరం వారిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు శాంతా బార్బారా కౌంటీ షరీఫ్ బిల్ బ్రౌన్ తెలిపారు.