విండీస్ కు కష్టసాధ్యమైన టార్గెట్ ఇచ్చిన టీమిండియా
- రెండో ఇన్నింగ్స్ ను 168/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన భారత్
- విండీస్ లక్ష్యం 468 రన్స్
- ప్రస్తుతం 4 వికెట్లకు 135 పరుగులు చేసిన ఆతిథ్య జట్టు
ఈ మ్యాచ్ లో భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేయగా, విండీస్ 117 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత్ 4 వికెట్లకు 168 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. తెలుగుతేజం హనుమవిహారి మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రహానేతో కలిసి విలువైన పరుగులు జోడించాడు. రహానే 64 పరుగులు చేయగా, విహారి 53 పరుగులతో అజేయంగా నిలిచాడు.