సాయంగా ఉంటాడని పనిలో పెట్టుకుంటే ఫ్రిజ్ లో పెట్టి కిడ్నాప్ చేశాడు!
- ఢిల్లీలో ఘటన
- కిషన్ అనే యువకుడ్ని పనిలో పెట్టుకున్న వృద్ధ దంపతులు
- యజమానిని ఫ్రిజ్ లో కుక్కి లారీలో వేసుకుని వెళ్లిన పనిమనిషి
మరుసటి రోజు ఉదయానికి గానీ ఖోస్లా భార్య మత్తు నుంచి తేరుకోలేకపోయింది. భర్త కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు. కొందరు వ్యక్తులు ఫ్రిజ్ ను మినీ లారీలో తరలించడం అందులో రికార్డయింది. దానికితోడు కిషన్ కూడా కనిపించకపోవడంతో ఇది అతడి పనే అని నిర్ధారించారు. ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్నారు. వృద్ధుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. తన పట్ల ఖోస్లా దంపతులు వ్యవహరిస్తున్న తీరుకు ప్రతీకారంగానే కిషన్ ఈ కిడ్నాప్ కు తెగించినట్టు భావిస్తున్నారు.