117 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్... టీమిండియాకు 299 పరుగుల ఆధిక్యం
- సబీనా పార్క్ లో రెండో టెస్టు
- నేడు ఆటకు మూడో రోజు
- మ్యాచ్ పై పట్టుబిగించిన భారత్
ప్రస్తుతం భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 4 పరుగులు చేసి రోచ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ కేఎల్ రాహుల్ కు తోడుగా పుజారా ఆడుతున్నాడు. ఆటకు నేడు మూడో రోజు కావడంతో రేపటిలోగా ఫలితం తేలే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్ లో భారత్ ఇప్పటికే తొలి టెస్టు నెగ్గి ముందంజ వేసింది.