ఓ యువకుడ్ని మూడేళ్లుగా వెంటాడుతున్న కాకులు!
- మధ్యప్రదేశ్ లో విచిత్రం
- హోటల్ కార్మికుడికి చుక్కలు చూపిస్తున్న కాకులు
- కాకిపిల్ల మరణంతో రెచ్చిపోయిన కాకులు
అప్పటికే ఆ కాకి పిల్లకు రక్షణగా అక్కడ కొన్ని కాకులు తమ అరుపులతో హంగామా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ కాకిపిల్లను కాపాడేందుకు శివ ప్రయత్నించగా, దురదృష్టవశాత్తు కాకిపిల్ల మరణించింది. దాంతో కాకులు రెచ్చిపోయాయి. అప్పటినుంచి శివ కనిపిస్తే చాలు పొడవడం మొదలుపెట్టాయి. ప్రతి రోజూ ఇదే తంతు! దాంతో ఆ హోటల్ కార్మికుడు ఇంట్లోంచి బయట అడుగుపెట్టాలంటే చేతిలో ఓ కర్ర తప్పనిసరి అయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.