చంద్రబాబు, పవన్ కల్యాణ్ సేమ్ టూ సేమ్: విజయసాయి రెడ్డి!
- అమరావతి విషయంలో పూర్తి స్పష్టత
- ప్రాంత ప్రజల కష్టాలు తీర్చడమే లక్ష్యం
- పవన్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య
గతంలో చంద్రబాబు యూ-టర్న్ లు తీసుకున్నట్టుగానే ఇప్పుడు పవన్ కల్యాణ్ యూ-టర్న్ లు తీసుకుంటున్నారని ఆరోపించారు. పవన్ ఇప్పుడు రెండు నాలుకల ధోరణిని ప్రదర్శిస్తున్నాడని అన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రజలు, రైతులకు ఉన్న కష్టనష్టాలను సరిచేయడమే తమ లక్ష్యమని చెప్పారు. గతంలో అమరావతి ప్రాంతం క్యాపిటల్ గా పనికిరాదని చెప్పి నిరసనలు తెలియజేసిన పవన్, నేడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని, ఆయన వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ ఒకేలా మారారని చురకలంటించారు.