హిందీ బుల్లితెర నటి నళినిపై రూమ్మేట్ దాడి.. ముఖాన్ని ఛిద్రం చేసే యత్నం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిందీ బుల్లితెర నటి నళినిపై రూమ్మేట్ దాడి.. ముఖాన్ని ఛిద్రం చేసే యత్నం!

  • ‘నామ్‌కరణ్’ షోతో పాప్యులర్ అయిన నటి
  • ప్రీతితో కలిసి కొన్నేళ్లుగా ఒకే ఫ్లాట్‌లో 
  • నళిని ముఖంపై తీవ్ర గాయాలు
స్టార్‌ప్లస్ టీవీలో ప్రసారమయ్యే ‘నామ్‌కరణ్’ షోతో పాప్యులర్ అయిన  బుల్లితెర నటి  నళిని నేగిపై రూమ్మేట్ దాడి చేసి గాయపరిచింది. రూమ్మేట్ ప్రీతి రాణా, తల్లి స్నేహలత రాణాతో కలిసి తనపై దాడిచేసిందంటూ పోలీసులకు నళిని ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడితో మారిపోయిన నళిని ముఖానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓషివారా పోలీసుల కథనం ప్రకారం.. కొన్నేళ్లుగా నళిని, ప్రీతి కలిసి ఉంటున్నారు. ఆ తర్వాత నళిని మరో ఫ్లాట్‌కు మారింది. ఇటీవల నళినిని కలిసిన ప్రీతి.. తనకు ఫ్లాట్ దొరకడం లేదని, దొరికేంత వరకు ఉంటానని అభ్యర్థించింది. దీనికి నళిని అంగీకరించింది. అయితే, ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రీతి తల్లి స్నేహలత కూడా వచ్చింది. దీంతో రూము ఖాళీ చేయడంలో ప్రీతికి సహాయం కోసమే ఆమె వచ్చిందని నళిని భావించింది.

గతవారం నళినితో స్నేహలత అకారణంగా వాదనకు దిగింది. అక్కడితో ఆగక కుమార్తె ప్రీతితో నళినిపై లేనిపోనివి చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి నళినిని అసభ్యంగా తిడుతూ దాడి చేశారు. స్నేహలత గ్లాసుతో నళిని ముఖంపై దాడిచేసింది. ఇద్దరూ కలిసి తనను చంపేందుకు ప్రయత్నించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నళిని పేర్కొంది. తాను నటిని కావడంతో తన ముఖాన్ని ఛిద్రం చేయాలని భావించారని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
nalini negi
tv actress
mumbai

More Telugu News