కాసేపట్లో అమరావతిలో పర్యటించనున్న పవన్ కల్యాణ్
- ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న పర్యటన
- రెండు రోజుల పాటు రాజధానిలో మకాం
- రైతులు, రైతు కూలీలతో సమావేశాలు
ఈ ఉదయం 10 గంటలకు మంగళగిరిలో బయల్దేరి నవులూరు, కృష్ణాయపాలెం, యర్రబాలెం, తుళ్లూరు మండలంలోని శాఖమూరు, దొండపాడు, అనంతవరం, యర్రబాలెం, ఐనవోలు, రాయపూడి గ్రామాల్లో పవన్ పర్యటిస్తారు. ఈ సందర్భంగా రైతులు, రైతు కూలీలతో సమావేశమై సమస్యలపై చర్చిస్తారు.