ఏపీ ప్రభుత్వ వైఖరితో న్యాయపరమైన ఇబ్బందులు తప్పవు: కేంద్రానికి నివేదిక సమర్పించిన పోలవరం అథారిటీ
- పోలవరంపై నివేదిక రూపొందించిన పీపీఏ
- రివర్స్ టెండరింగ్ కు వెళితే ఎదురయ్యే నష్టాలను వివరించిన అథారిటీ
- ప్రాజక్టు నిర్మాణం మరింత ఆలస్యం అవుతుందని వెల్లడి
రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజక్టు నిర్మాణం మరింత ఆలస్యమవుతుందని పేర్కొంది. ప్రాజక్టు నిర్మాణంలో ఇప్పటికే నాలుగేళ్లు జాప్యం జరిగిందని తత్ఫలితంగా పట్టిసీమ, పురుషోత్తమపట్నం ప్రాజక్టులు మరింత భారం కానున్నాయని, పోలవరం ద్వారా జరగాల్సిన ప్రయోజనాల విషయంలోనూ మరింత ఆలస్యం తప్పదని వివరించింది.