Amaravathi: రాజధానిపై సీఎం జగన్ తన వైఖరి స్పష్టం చేయాలి: కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్

రాజధాని అమరావతిపై సీఎం జగన్ తన వైఖరిని స్పష్టం చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే దానికి చేసే దానికి పొంతన లేదని విమర్శించారు. తమ ప్రాంతంలో రాజధాని వస్తుందని మూడు పంటలు పండే పొలాలను రైతులు త్యాగం చేశారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక కొందరి కోసమే వైసీపీ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనిపిస్తోందని, ఇప్పటికే వేలాది కోట్లు రాజధాని నిర్మాణానికి వెచ్చించారని అన్నారు. రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని, రాజధాని అమరావతిలోనే ఉండాలని తాము భావిస్తున్నామని చెప్పారు. త్వరలో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని తనను కలిసిన రైతులతో కన్నా పేర్కొన్నారు.
Amaravathi
YSRCP
cm
jagan
Bjp
Kanna

More Telugu News