మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ గౌర్ కన్నుమూత

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ గౌర్ ఈ ఉదయం భోపాల్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. రక్తపోటు ఒక్కసారిగా పడిపోవడంతో ఈ నెల 7న ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత వెంటిలేటర్‌పై ఉంచారు. తాజాగా పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.

ఆగస్టు 2004 నుంచి నవంబరు 2005 వరకు గౌర్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2 జూన్ 1930న జన్మించిన బాబులాల్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ విస్తరణకు శ్రమించి విజయం సాధించారు. వయసు మీద పడడంతో గతేడాది ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
Go Back to Shorts
Madhya Pradesh
babulal gaur
Chief Minister

More Telugu News