జార్ఖండ్‌లో దారుణం.. దుష్టశక్తులు ఆవహించాయని మహిళ కళ్లు పెకిలించారు!

దుష్టశక్తులు ఆవహించాయంటూ పదునైన ఆయుధంతో ఓ మహిళ కళ్లను పెకిలించారు. జార్ఖండ్‌లోని గర్వా ప్రాంతంలో జరిగిందీ దారుణం. పోలీసుల కథనం ప్రకారం.. కొండిర గ్రామానికి చెందిన రుడానీదేవి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు.. ఆలందేవి-సత్యేంద్ర ఓరన్ అనే తాంత్రిక విద్యలు చేసే దంపతులను ఆశ్రయించారు.

రుడానీదేవిని  పరీక్షించిన ఆలందేవి దంపతులు ఆమెకు దుష్టశక్తులు ఆవహించాయని వారిని నమ్మించారు. త్రిశూలం లాంటి పదునైన ఆయుధంతో ఒళ్లంతా తూట్లు పొడిచారు. అంతేకాదు, ఆమె రెండు కళ్లను పెకిలించారు. దీంతో బాధతో విలవిల్లాడిన రుడానీదేవి కన్నుమూసింది. విషయం వెలుగులోకి రావడంతో రుడానీదేవి కుటుంబ సభ్యులతోపాటు, తాంత్రిక దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
Go Back to Shorts
jharkhand
black magic
eyes
woman

More Telugu News