కేటీఆర్... నడ్డా నీలాగా కార్పొరేట్ సంస్థల పెంపుడు నేత కాదు: దత్తాత్రేయ ఘాటు వ్యాఖ్యలు
- నడ్డా కాదు అబద్ధాల అడ్డా అంటూ కేటీఆర్ విమర్శలు
- మండిపడిన దత్తన్న
- కేటీఆర్ కు లేఖ
ఆరోగ్యశ్రీ నిలిపివేతతో పేదలు రోడ్డున పడ్డారని దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం అబద్ధాల పుట్టని తన లేఖలో ఆరోపించారు. ఓ కార్యక్రమంలో నడ్డాపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. నడ్డా కాదు, అబద్ధాల అడ్డా అంటూ కేటీఆర్ ప్రాసతో కూడిన విమర్శలు చేశారు.