జగన్ అప్పుడు జెరూసలేంకు, ఇప్పుడు అమెరికాకు వెళ్లారు!: అచ్చెన్నాయుడు విమర్శలు
- సీఎం జగన్ కు పిచ్చి పట్టింది
- వరదలపై కేంద్రం, సీడబ్యూసీ హెచ్చరించినా పట్టించుకోలేదు
- చంద్రబాబును ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారు
అప్పుడు గోదావరి నదికి వరదలు వచ్చినప్పుడు జెరూసలేంకు, ఇప్పుడు కృష్ణా నదికి వరదలు వస్తే అమెరికా విహారయాత్రకు జగన్ వెళ్లారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ కు పిచ్చి పట్టిందని, వరదలపై కేంద్రం, సీడబ్యూసీ హెచ్చరించినా పట్టించుకోలేదని, చంద్రబాబును ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. వరదల వల్ల పంటలు సర్వనాశనమయ్యాయని అన్నారు. వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందిపడుతుంటే, చంద్రబాబు నివాసం చుట్టూ మంత్రులు చక్కర్లు కొడుతున్నారని ధ్వజమెత్తారు.