Andhra Pradesh: చంద్రబాబు గారి కష్టం పగవాడికి కూడా రాకూడదు!: వైసీపీ నేత విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. కరకట్ట లోపల నిర్మించిన తన ఇంటికి వరద ముప్పు ఉందని తెలుసుకున్న చంద్రబాబు హైదరాబాద్ కు పారిపోయారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఆయన ఇంటిలోని కార్లు, ఇతర విలువైన వస్తువులను మరోచోటికి తరలించారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు గారి కష్టాలు పగవాడికి కూడా రాకూడదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నదిని పూడిస్తే ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో ఇప్పుడైనా అర్థమయిందా చంద్రబాబు గారూ? అని ప్రశ్నించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.-++++
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Vijay Sai Reddy

More Telugu News