ఆర్టికల్ 370ని శ్యామా ప్రసాద్ ముఖర్జీ గుర్తించారు.. ఇది మోదీ సర్కారుకే తెలియదు!: ఒవైసీ

ప్రధాని నరేంద్ర మోదీపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. భారత తొలి ప్రధాని నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్ పటేల్ లకు ఉన్నంత పరిజ్ఞానం మోదీకి లేదని విమర్శించారు. అప్పట్లో దేశ ప్రయోజనాల రీత్యా ఈ ఇద్దరు నేతలు కశ్మీర్ పై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

ఇప్పుడు మోదీ ప్రభుత్వం తాము స్వాతంత్ర్య సమరయోధుడు, జనసంఘ్ చీఫ్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అడుగుజాడల్లో నడుస్తున్నట్లు చెబుతోందని ఒవైసీ అన్నారు. అయితే ఆర్టికల్ 370ని తాను గుర్తిస్తున్నట్లు శ్యామా ప్రసాద్ ముఖర్జీ చెప్పిన విషయం వీరికి తెలియదని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Jammu And Kashmir
MIM
Asaduddin Owaisi
BJP
article 370

More Telugu News