మరోసారి విష్ణు విశాల్ తో జోడీ కడుతోన్న అమలా పాల్

  • తమిళంలో హిట్ కొట్టిన 'రాచ్చసన్'
  • తెలుగు రీమేక్ కూడా హిట్
  • తమిళ రీమేక్ గా 'జెర్సీ'     
తమిళంలో విష్ణు విశాల్ - అమలా పాల్ కలిసి ఆ మధ్య చేసిన 'రాచ్చసన్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ సినిమా తెలుగులో 'రాక్షసుడు' పేరుతో రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టేసింది. ఈ సారి తెలుగులో హిట్ కొట్టిన మరో సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది.

నాని - శ్రద్ధా శ్రీనాథ్ జంటగా చేసిన 'జెర్సీ' వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. విష్ణు విశాల్ - అమలా పాల్ జంటగా తమిళంలో ఈ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి నిర్మాతగా రానా పేరు వినిపిస్తోంది. త్వరలోనే దర్శకుడు ఎవరనే విషయంలో స్పష్టత రానుంది. ఇక హిందీలోనూ 'జెర్సీ' రీమేక్ కి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
Vishnu Vishal
Amala Paul

More Telugu News