తమన్నాతో జర్నలిస్టులకు క్షమాపణ చెప్పించిన నాగార్జున
- జర్నలిజం ఒక యాక్టింగ్ అన్న తమన్నా
- తీవ్రంగా పరిగణించిన నాగార్జున
- చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నట్టు చెప్పిన తమన్నా
ఇదే విషయాన్ని ప్రస్తావించి ఎందుకలా నోరు పారేసుకున్నావని ప్రశ్నించాడు. స్పందించిన తమన్నా తానలా అనలేదని అనడంతో నాగ్ మరింత సీరియస్ అయ్యాడు. హౌస్‌లో ఆమె మాట్లాడిన వీడియో క్లిప్‌ను చూపించడంతో తమన్నా సైలెంట్ అయిపోయింది. అది చూసి తలదించుకుని నవ్వుతున్న తమన్నాపై నాగార్జున మండిపడ్డాడు. అప్పుడేమో జర్నలిజం ఒక యాక్టింగ్ అని, ఇప్పుడు ముసుముసిగా నవ్వుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో స్పందించిన తమన్నా.. తాను నవ్వడం లేదని, చేసిన తప్పుకు సిగ్గుపడుతున్నానని చెప్పుకొచ్చింది. దీంతో శివజ్యోతి సహా జర్నలిస్టులు అందరికీ తమన్నాతో నాగ్ క్షమాపణలు చెప్పించాడు.