హైదరాబాదులో రేపు ప్రయివేటు ఆసుపత్రుల ధర్నా

  • ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయనున్న ఆసుపత్రుల యాజమాన్యాలు
  • ఆరోగ్యశ్రీ బకాయిలు పూర్తిగా చెల్లించాలంటూ డిమాండ్
  • ప్రస్తుతం ఇస్తున్న టారిఫ్ పెంచాలంటూ మరో డిమాండ్
హైదరాబాదులో రేపు ప్రయివేటు ఆసుపత్రులు ధర్నాకు దిగుతున్నాయి. ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఇందిరా పార్కు వద్ద ధర్నా చేయనున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నది వారి ప్రధాన డిమాండ్. అంతేగాకుండా, ప్రస్తుతం ఇస్తున్న టారిఫ్ ను కూడా పెంచాలని కోరుతున్నారు. మరోవైపు, ఎంసీఐ స్థానంలో ఎన్ఎంసీ బిల్లు తెస్తున్నారంటూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె నేటితో ముగిసింది. మంత్రి ఈటలతో చర్చల అనంతరం జూడాలు సమ్మె విరమించారు.
Go Back to Shorts
Hyderabad
Indira Park
Private Hospitals

More Telugu News