అజిత్ సినిమా టికెట్ దొరకలేదని ఆత్మహత్యాయత్నం!
- పింక్ రీమేక్ గా 'నెర్కొండ పార్వై'
- నిన్న విడుదలైన చిత్రం
- తొలిరోజు టికెట్ దొరకలేదని ఆత్మహత్యాయత్నం
చెన్నై, రాయపేటలోని సత్యం సినీ మల్టీప్లెక్స్ వద్ద ఈ ఘటన జరుగగా, ఆ సమయంలో అక్కడే ఉన్న నటుడు శంతను భాగ్యరాజ్, తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించాడు. రాత్రి, 11.55 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పాడు. టికెట్ దొరకలేదన్న కారణంగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడని అన్నారు. అక్కడే ఉన్న పోలీసులు, అతన్ని అరెస్ట్ చేసి తరలించారని, అభిమానులు ఈ తరహా చర్యలకు పాల్పడవద్దని శంతను పిలుపునిచ్చాడు.