భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర... ఏపీ సహా ఏడు రాష్ట్రాల్లో హైఅలర్ట్
- ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో రగిలిపోతున్న పాకిస్థాన్
- పుల్వామా తరహా ఉగ్రదాడులకు స్కెచ్
- విమానాశ్రయాల వద్ద భద్రత కట్టుదిట్టం
ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. దేశంలోని అన్ని విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. విజిటర్స్ ను కూడా అనుమతించడం లేదు. కేవలం ప్రయాణికులను మాత్రమే విమానాశ్రయాల వద్దకు అనుమతిస్తున్నారు.