సునీల్ శెట్టి తనయుడు హీరోగా హిందీ 'ఆర్ ఎక్స్ 100'
- తెలుగులో హిట్ కొట్టిన 'ఆర్ ఎక్స్ 100'
- మిలన్ లుథ్రియా దర్శకత్వంలో హిందీ రీమేక్
- అహన్ శెట్టి సరసన తారా సుతారియా
ఇంతకీ అహన్ శెట్టి చేసే సినిమా .. 'ఆర్ ఎక్స్ 100' రీమేక్. తెలుగులో అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెరకెక్కిన 'ఆర్ ఎక్స్ 100' భారీ విజయాన్ని అందుకుంది. రొమాన్స్ తో కూడిన ఈ యాక్షన్ మూవీ యూత్ కి విపరీతంగా నచ్చేసింది. అందుకే సునీల్ శెట్టి ఈ కథను ఎంచుకున్నట్టుగా సమాచారం. మిలన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, అహన్ శెట్టి జోడీగా తారా సుతారియా నటిస్తోంది.