Andhra Pradesh: ముద్దాయి నెం.3 సెర్బియాలో అరెస్ట్.. ముద్దాయి నెం.1 విదేశీయాత్ర.. ఏం జరుగుతోంది?: వైసీపీపై వర్ల రామయ్య ఘాటు విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం నేత వర్ల రామయ్య ఈరోజు వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియా పోలీసులు అరెస్ట్ చేయడం, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈరోజు ట్విట్టర్ లో వర్ల రామయ్య స్పందిస్తూ..‘ఏపీ ముఖ్యమంత్రి గారికి..ముద్దాయి నెం.3(నిమ్మగడ్డ) సెర్బియాలో అరెస్టు - విడుదల - అక్కడే ఉండాలని ఆదేశం.

ముద్దాయి నెం.2(విజయసాయిరెడ్డి) ఢిల్లీ - పార్లమెంటు - లాబీయింగ్. ముద్దాయి నెం.1(జగన్) విదేశీ యాత్ర. మొత్తం క్రోడీకరిస్తే శేషం ఏమిటీ? ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అందరికీ తెలియాలి. ఎవరైనా ఈ ముడి విప్పగలరా?’ అని ట్వీట్ చేశారు. పలు కేసుల్లో సీఎం జగన్, నిమ్మగడ్డ ప్రసాద్, విజయసాయిరెడ్డి నిందితులుగా ఉన్న నేపథ్యంలో వర్ల రామయ్య ఈ మేరకు విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
varla ramaiah
YSRCP
Jagan
Vijay Sai Reddy
nimmagadda prasaed

More Telugu News