మిస్ ఇంగ్లాండ్ అందాల పోటీల్లో టైటిల్ గెలిచిన భారత అమ్మాయి... అమ్మడు చాలా స్పెషల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మిస్ ఇంగ్లాండ్ అందాల పోటీల్లో టైటిల్ గెలిచిన భారత అమ్మాయి... అమ్మడు చాలా స్పెషల్!

  • మిస్ ఇంగ్లాండ్ విజేతగా బాషా ముఖర్జీ
  • బాషాకు రెండు మెడికల్ డిగ్రీలు
  • ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల బాషా
మిస్ ఇంగ్లాండ్ పోటీల్లో ఓ భారత సంతతి యువతి  విజేతగా నిలిచింది. ఆమె పేరు బాషా ముఖర్జీ. మిస్ ఇంగ్లాండ్ అందాల పోటీల్లో 12 మంది ఫైనలిస్టులను అధిగమించి అందాల రాణి కిరీటం దక్కించుకుంది. తద్వారా మిస్ వరల్డ్ పోటీలకు అర్హత సాధించింది. 23 ఏళ్ల బాషా ముఖర్జీ ఓ జూనియర్ డాక్టర్. ప్రస్తుతం బోస్టన్ లో పనిచేస్తోంది. బాషా ముఖర్జీ ప్రత్యేకతల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు.

ఆమె 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. ఒక మెడికల్ డిగ్రీ సంపాదించడమే చాలా కష్టమైన నేపథ్యంలో, అమ్మడు రెండు మెడికల్ డిగ్రీలు సాధించింది. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ భారత సంతతి యువతి ఐక్యూ స్థాయి 146 కావడం విశేషం. బాషాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం బ్రిటన్ వలస వెళ్లింది. ఆమె విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. మెడిసిన్ చదువుతున్నప్పుడే అందాల పోటీల్లోనూ పాల్గొనాలని నిశ్చయించుకుని అన్నివిధాలుగా సంసిద్ధమైంది.
UK
Basha
Miss England

More Telugu News