ఫుడ్ డెలివరీ బాయ్ ముస్లిం అని వెనక్కి పంపిన వ్యక్తి.. జైలుకు పంపుతామన్న పోలీసులు
- డెలివరీ బాయ్ హిందువు కాదని తిప్పి పంపానంటూ ట్వీట్
- ఆహారానికి మతం ఉండదన్న జొమాటో
- మరోసారి అలాంటి ట్వీట్లు చేస్తే తీవ్ర పరిణామాలంటూ పోలీసుల హెచ్చరిక
దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చకు దారితీసిన అమిత్ ట్వీట్‌పై జొమాటో తీవ్రంగా స్పందించింది. ఆహారానికి మతం ఉండదని బదులిచ్చింది. మరోవైపు, పోలీసులు కూడా స్పందించారు. మరోసారి ఇలాంటి ట్వీట్లు చేస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని నోటీసులు పంపారు. మతపరమైన విద్వేషాలు రేకెత్తించేలా ఇలాంటి వ్యాఖ్యలు తగవని హితవు పలికారు.