Andhra Pradesh: ముగిసిన కేసీఆర్-జగన్ భేటీ

షార్ట్స్‌లో చూడండి
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ల భేటీ ముగిసింది. ప్రగతి భవన్ లో సుమారు మూడు గంటల పాటు ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. అయితే, ఈ చర్చల అజెండా ఏమిటో బయటకు రాలేదు. ఈ సమావేశంలో ప్రధానంగా నీటి పంపకాలపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. గోదావరి జలాలు శ్రీశైలం డ్యామ్ కు తరలింపు, విభజన అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. గోదావరి జలాల తరలింపుపై ప్రతిపాదనలను రెండు రాష్ట్రాల ఇంజనీర్లు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. గోదావరి జలాలను ఎలా తరలిస్తే ప్రయోజనకరంగా ఉంటుందనే అంశంతో పాటు అంచనా వ్యయం, తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం.
 
Go Back to Shorts
Andhra Pradesh
cm
Jagan
Telangana
kcr

More Telugu News