ప్రేమించి, పెళ్లాడి వేధింపులు... ఊచలు లెక్కిస్తున్న హైదరాబాద్ యువకుడు!
- యువతితో స్నేహం ప్రేమగా మారగా వివాహం
- ఆపై భర్త నిర్వాకాలు తెలుసుకున్న భార్య
- వివాదం తలెత్తడంతో వేధింపులు
ఆపై వారి కాపురంలో గొడవలు వచ్చాయి. తన భర్తకు అనేకమంది స్నేహితురాళ్లు ఉన్నారని తెలుసుకున్న ఆమె నిలదీయగా, భార్యను దూరం పెట్టడం ప్రారంభించాడు. గొడవలు ముదిరి, ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయంలో ఆమె పోలీసులను ఆశ్రయించినా, రవీందర్ పట్టుబడక పోవడంతో కేసులో పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలో భార్యను వేధించాలన్న ఉద్దేశంతో, ఆమె పేరిట ఫేస్ బుక్ ఖాతాను తెరవడంతో పాటు ఆమెను కాల్ గర్ల్ గా చిత్రించాడు. తనతో దిగిన సెల్ఫీలను మార్ఫింగ్ చేసి అప్ లోడ్ చేశాడు. అసభ్యకర మెసేజ్ లను పెట్టాడు. దీంతో యువతి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. కేసును నమోదు చేసి, సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు, అతన్ని అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు.