టీమిండియా ఆటగాళ్ల భార్యల మధ్య గొడవలు... రవిశాస్త్రి స్పందన
- ఇవన్నీ తప్పుడు వార్తలు
- ఆటగాళ్ల భార్యలు బ్యాటింగ్ చేస్తున్నారనే వార్తలు కూడా చదవాల్సి వస్తుందేమో
- క్రికెట్ కంటే ఏ ఆటగాడూ గొప్పవాడు కాదు
క్రికెట్ కంటే ఏ ఆటగాడు గొప్ప కాదని రవిశాస్త్రి అన్నారు. తాను కానీ, ఏ ఆటగాడైనా కానీ గొప్ప కాదని చెప్పారు. అన్ని ఫార్మాట్లలో టీమిండియా అద్భుతంగా రాణిస్తోందని అన్నారు. ప్రపంచకప్ లో కూడా మన జట్టు అద్భుతమైన ఆటతీరును కనబరిచిందని చెప్పారు. గత 18 నెలల్లో టెస్టుల్లో అద్భుతంగా రాణించామని, వన్డేల్లో పరుగుల వరద పారించామని తెలిపారు. టెస్టుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని, వన్డేల్లో నెంబర్ టూ గా ఉన్నామని, టీ20ల్లో కొంత మెరుగు పడాల్సి ఉందని చెప్పారు. ప్రపంచకప్ లో గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని... ఓడినంత మాత్రాన మన ఆటగాళ్ల ప్రదర్శనను తక్కువ చేసి మాట్లాడలేమని అన్నారు.