Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో పులుల సంఖ్య పెరగడంపై సీఎం జగన్ హర్షం

షార్ట్స్‌లో చూడండి
అంతర్జాతీయ పులుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్ ఓ ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పులుల సంఖ్య పెరగడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఏపీలో పులుల సంఖ్య 48కి చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పులుల సంతతి పెంపు, సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మన జాతీయ జంతువు అయిన పులులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకోసం పర్యావరణ సమతుల్యతను కాపాడాల్సిన అవసరం ఉందని సూచించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
Tigers
cm
Jagan

More Telugu News