సభ్యత్వ నమోదు చేసుకున్న వారందరికీ ఆగస్టు 1 నుంచి బీమా సౌకర్యం: కేటీఆర్
- నెలాఖరులోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి
- 50 లక్షల సభ్యత్వాలు నమోదు చేయడం అరుదు
- వివరాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్
నియోజకవర్గాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్, నెలలోనే 50 లక్షల సభ్యత్వాలు నమోదు చేయడం దేశ రాజకీయాల్లోనే అరుదన్నారు. గజ్వేల్, పాలకుర్తి నియోజకవర్గాలు సభ్యత్వ నమోదులో ముందుండటంతో వాటిని అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రూ.15 కోట్లు సభ్యత్వ రుసుం కింద అందినట్టు తెలిపారు.