నేను ఎవ్వరికీ బకాయి పడలేదు.. సాక్ష్యాలు చూపిస్తే సెటిల్ చేస్తా!: కేశినేని నాని
- గుంటూరు లేబర్ కోర్టుకు 14 మంది వెళ్లారు
- కోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నా
- ఎవ్వరి ట్వీట్లకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు
తాను నిజంగా ఉద్యోగులకు బకాయి ఉన్నట్లు ఆధారాలు చూపిస్తే సెటిల్ చేసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనీ, వందలాది మందికి జీతాలు ఇవ్వనట్లు ట్వీట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు జీతాలు అందని వందల మంది కార్మికులు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరి ట్వీట్లకూ సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని తేల్చిచెప్పారు.