రవిశాస్త్రిని మారిస్తే జట్టు సమీకరణ దెబ్బతింటుంది: బీసీసీఐ సీనియర్ అధికారి
- రవిశాస్త్రిని మారిస్తే జట్టు విజయాలపై ప్రభావం పడుతుంది
- కోహ్లీ-రవిశాస్త్రి మధ్య మంచి అవగాహన ఉంది
- వీరి జోడీని మారిస్తే జట్టు దెబ్బతింటుంది
కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ముుందుకు సాగుతున్నారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. వీరి జోడీని మార్చడం వల్ల జట్టు విజయాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. కోచ్ రవిశాస్త్రిని మారిస్తే జట్టు సమీకరణలు దెబ్బతినే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 2020లో జరగనున్న టీ20 ప్రపంచకప్, 2023 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని రవిశాస్త్రిని మార్చకపోవడమే మంచిదని ఆయన పేర్కొన్నారు.