కర్ణాటక రాజకీయం రసవత్తరం.. స్వతంత్ర ఎమ్మెల్యేలున్న అపార్టుమెంట్ వద్దకు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు!
- ఓ అపార్టు మెంట్ లో ఇధ్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు
- ఆ అపార్టుమెంట్ ను చుట్టుముట్టిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు
- లోపలికి అనుమతించకపోవడంపై కాంగ్రెస్ ఆగ్రహం
ఈ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఓ అపార్టు మెంట్ లో ఉన్నారు. ఈ సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆ అపార్టుమెంట్ ను చుట్టుముట్టారు. ఎమ్మెల్యేలను కలిసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. అయితే, అపార్టుమెంట్ లోపలికి తమను అనుమతించకపోవడంతో, ఓ దశలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.