ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే సభ నుంచి సస్పెన్షనా?: టీడీపీ నేత కళా వెంకట్రావు
- టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం అన్యాయం
- ప్రజా వ్యతిరేక విధానాలను స్పీకర్ ప్రోత్సహించకూడదు
- సభ్యులను సస్పెండ్ చేయడం చేతగానితనానికి నిదర్శనం
అసెంబ్లీలో వైసీపీ సభ్యులు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు జగన్ చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తోందొకటని విమర్శించారు. టీడీపీపై బురదజల్లడమే జగన్ పనిగా పెట్టుకున్నారని, ఆయనలో అసహనం పెరిగిపోతోందని విమర్శించారు. సభను నడపాల్సింది స్పీకర్ అనీ, సీఎం కాదని ఆయన అన్నారు.