తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం...వృద్ధులకు ప్రత్యేక దర్శనం
- ఐదేళ్లలోపు చిన్నారులతో పాటు వచ్చిన తల్లిదండ్రులకు కూడా
- సాధారణ దినాల్లో ఈ వెసులుబాటు
- ఈనెల 23న నుంచి అమల్లోకి రానున్న సదుపాయం
65 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఐదేళ్లలోపు చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు, దివ్యాంగులు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన టోకెన్లు ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్లలో ఇస్తారు. ఇప్పటివరకు సాధారణ రోజుల్లో ఏడాదిలోపు చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులకు మాత్రమే ఈ అవకాశం లభిస్తోంది. భక్తుల కోరిక మేరకు చిన్నారుల వయసు పరిమితిని ఐదేళ్లకు పెంచారు.