లేదు.. జింబాబ్వే క్రికెట్‌లో ప్రభుత్వ జోక్యం అస్సలు లేదు: క్రీడల మంత్రి వివరణ
- జింబాబ్వేను నిషేధించిన ఐసీసీ
- షాక్‌లో క్రికెటర్లు, ప్రభుత్వం
- ఐసీసీ ఆరోపణలను ఖండించిన మంత్రి
కాగా, ఐసీసీ నిర్ణయంపై తాజాగా ఆ దేశ క్రీడా మంత్రి కిర్‌స్టీ కోవెంట్రీ స్పందించారు. ఐసీసీ ఆరోపణలను ఖండించారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. ఒలింపిక్ స్విమ్మింగ్ పతక విజేత అయిన మంత్రి కోవెంట్రీ మాట్లాడుతూ.. క్రికెట్ బోర్డులో ప్రభుత్వం ఏనాడూ తలదూర్చలేదని పేర్కొన్నారు. ఐసీసీ నిర్ణయం ఆటగాళ్ల భవిష్యత్తును నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.