చంద్రబాబు చేసిందేమీలేదు.. పోలవరంకు అన్ని అనుమతులు తీసుకొచ్చింది వైయస్సారే: అనిల్ కుమార్ యాదవ్
- శంకుస్థాపనలు, ఫొటోలు దిగడం తప్ప చంద్రబాబు ఏమీ చేయలేదు
- జనాలను తీసుకెళ్లి భజన చేయించుకున్నారు
- భూనిర్వాసితులకు న్యాయం చేయాలని జగన్ చెప్పారు
పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చింది రాజశేఖరరెడ్డేనని అనిల్ చెప్పారు. వైయస్ హయాంలో కాలువలు తవ్వారని... అప్పుడు తవ్వకపోయి ఉంటే భూసేకరణకు వేల కోట్ల రూపాయల భారం పడేదని తెలిపారు. భూనిర్వాసితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని అన్నారు.