ప్రపంచకప్‌లో విచిత్రం.. న్యూజిలాండ్‌ను ఓడించిన స్టోక్స్ న్యూజిలాండ్ వాసే!
- బెన్ స్టోక్స్ పుట్టింది న్యూజిలాండ్‌లోనే
- ఫైనల్‌లో కివీస్‌కు కొరకరాని కొయ్యగా మారిన వైనం
- మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ అందుకున్న తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా రికార్డు
అయితే, ఈ మ్యాచ్‌కో ప్రత్యేకత ఉంది. న్యూజిలాండ్‌కు ముచ్చెమటలు పట్టించి ఇంగ్లండ్ ప్రపంచకప్ కలను సాకారం చేసిన బెన్ స్టోక్స్ పుట్టింది న్యూజిలాండ్‌లో కావడం విశేషం. 28 ఏళ్ల స్టోక్స్ ఆ దేశంలోని క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించాడు. ప్రపంచకప్ పైనల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుని ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్ అయ్యాడు. ఇక, ఫలితం కోసం నిర్వహించిన సూపర్ ఓవర్‌లో ఇంగ్లండ్ 15 పరుగులు చేయగా, అందులో బెన్ స్టోక్స్ 8 పరుగులు చేయడం విశేషం.