England: ​​కీలక వికెట్లు చేజార్చుకున్న ఇంగ్లాండ్... ఆతిథ్య జట్టుకు కష్టాలు తప్పవా?

షార్ట్స్‌లో చూడండి
న్యూజిలాండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ పోరులో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు మరో రెండు వికెట్లు చేజార్చుకుంది. 7 పరుగులు చేసిన జో రూట్ రెండో వికెట్ రూపంలో వెనుదిరగ్గా, కాసేపటికే ఓపెనర్ బెయిర్ స్టో (36) సైతం అవుటయ్యాడు. 242 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలో దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ అవుటైన తర్వాత దూకుడు తగ్గించింది. కివీస్ బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసురుతూ ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ సహనాన్ని పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆతిథ్య జట్టు 21 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (9), బెన్ స్టోక్స్ (1) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 29 ఓవర్లలో 167 పరుగులు చేయాలి.
Go Back to Shorts
England
New Zealand

More Telugu News