New Zealand: వరల్డ్ కప్ ఫైనల్: టాస్ గెలిచిన న్యూజిలాండ్

షార్ట్స్‌లో చూడండి
ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచింది. లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ అంతిమ సమరంలో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ మరేమీ ఆలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఇరుజట్లు దాదాపుగా సెమీఫైనల్స్ ఆడిన ఆటగాళ్లనే బరిలో దించుతున్నాయి. ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన తొలి సెమీస్ లో న్యూజిలాండ్ జట్టు భారత్ ను ఓడించగా, 11వ తేదీన జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు తన చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాను మట్టికరిపించి టైటిల్ పోరుకు సిద్ధమైంది.

కాగా, ఫైనల్స్ ఆడుతున్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఎవరు గెలిచినా చరిత్ర అవుతుంది. ఎందుకంటే ఈ రెండు జట్లలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ప్రపంచకప్ నెగ్గలేదు. అందుకే తొలిసారి వరల్డ్ కప్ ను సగర్వంగా పైకెత్తాలని ఇంగ్లాండ్, కివీస్ తహతహలాడుతున్నాయి.
Go Back to Shorts
New Zealand
England
World Cup
Final
Toss

More Telugu News