Andhra Pradesh: గిరిజన మహిళలతో కలిసి ‘థీంసా’ స్టెప్పులేసిన ఏపీ టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్.. వీడియో వైరల్!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈరోజు విశాఖపట్నంలోని ఏజెన్సీలో పర్యటించారు. ఈ సందర్భంగా పాడేరు ఏజెన్సీలోని ఐటీడీఏ ఆఫీసులో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయడంపై చర్చించారు.

ఈ సందర్భంగా స్థానిక గిరిజన రైతులకు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు.  ఈ పర్యటనలో భాగంగా పాడేరులోని మోదుకొండమ్మ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ ‘థీంసా’ డ్యాన్స్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
Go Back to Shorts
Andhra Pradesh
Visakhapatnam District
dhimsa dance
Viral Videos
avanti srinivas
tribal people
tribal woman
dance video

More Telugu News