కడప జిల్లాలోని గిరిజన హాస్టల్ లో కలుషిత ఆహారం సరఫరా.. 60 మంది విద్యార్థులకు అస్వస్థత!
- ఆహారం కలుషితం కావడంతో ఆస్పత్రిపాలైన విద్యార్థులు
- విద్యార్థులకు చికిత్స అందజేస్తున్న వైద్యులు
- ఇంకా స్పందించని అధికారులు, ప్రభుత్వం
వెంటనే చికిత్స ప్రారంభించిన వైద్యులు విద్యార్థులకు సెలైన్లు ఎక్కించారు. ఈ విషయమై డాక్టర్లు మాట్లాడుతూ.. కలుషిత ఆహారం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం స్థిరంగా ఉందనీ, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఇటు జిల్లా అధికారులు, అటు ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు.