అంజలి ప్రధాన పాత్రధారిగా ఫాంటసీ చిత్రం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంజలి ప్రధాన పాత్రధారిగా ఫాంటసీ చిత్రం

  • మరో తమిళ సినిమాకి ఓకే చెప్పిన అంజలి
  •  కామెడీతో కూడిన ఫాంటసీతో నడిచే కథ
  •  త్వరలోనే సెట్స్ పైకి   
తెలుగు .. తమిళ భాషల్లో అంజలికి మంచి క్రేజ్ వుంది. ఈ రెండు భాషల్లో ప్రస్తుతం గట్టిపోటీ ఉన్నప్పటికీ ఆమె అవకాశాలను దక్కించుకుంటూ వెళుతోంది. నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను కూడా ఆమె బాగానే ఒప్పేసుకుంటోంది. తాజాగా ఆమె మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాను అంగీకరించింది.

కేఎస్ సినీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, కృష్ణన్ జయరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా కృష్ణన్ జయరాజ్ మాట్లాడుతూ .. "సాధారణంగా లేడీ ఓరియెంటెడ్ మూవీ అనగానే హారర్ నేపథ్యంతో కూడినదేమోనని అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా కామెడీ ఫాంటసీ. కథ వినగానే అంజలి అంగీకరించడం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. యోగిబాబు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాడు. తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నాము" అని చెప్పుకొచ్చాడు.
anajali

More Telugu News