Sensex: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. రేపు ఎకనామిక్ డేటా విడుదల కానున్న నేపథ్యంలో ఫైనాన్షియల్, ఆటో సూచీలు లాభాలను గడించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 266 పాయింట్లు పెరిగి 38,823కి ఎగబాకింది. నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 11,583 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హీరో మోటో కార్ప్ (4.46%), టాటా మోటార్స్ (3.63%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.57%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.51%), వేదాంత లిమిటెడ్ (2.31%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.33%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.99%), యస్ బ్యాంక్ (-0.65%), టీసీఎస్ (-0.30%), ఎల్ అండ్ టీ (-0.28%).          
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News