Team India: స్టేడియంకు వెళుతున్న టీమిండియా బస్సుపై పువ్వులు చల్లి శుభాకాంక్షలు తెలిపిన అభిమాని

షార్ట్స్‌లో చూడండి
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ లో నేడు భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నాయి. మాంచెస్టర్ వేదికగా జరిగే ఈ కీలక సమరం ఇరు జట్ల అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కాగా, సెమీఫైనల్ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోన్న ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానానికి చేరుకునేందుకు టీమిండియా ఆటగాళ్లు బస్సులో పయనమయ్యారు. ఈ సందర్భంగా క్రికెటర్లు బస చేసిన హోటల్ వద్ద అభిమానులు పెద్ద ఎత్తున గుమికూడి శుభాకాంక్షలు తెలిపారు. ఆటగాళ్లు బస్సులోకి ఎక్కుతుండగా ఓ వ్యక్తి బస్సుపై పువ్వులు చల్లుతూ టీమిండియా గెలవాలంటూ నినాదాలు చేశాడు. అక్కడ చేరిన అభిమానులు కూడా జీతేగా జీతేగా ఇండియా జీతేగా, భారత్ మాతాకీ జై అంటూ జట్టును ఉత్సాహపరిచారు.
Go Back to Shorts
Team India
New Zealand
Semifinal
World Cup

More Telugu News