దయచేసి, ఇసుక విధానం ధరలను ఖరారు చేయండి: సీఎం జగన్ కు కన్నా లేఖ

  • ఇసుక విధానంలో తుది నిర్ణయం తీసుకోవాలి
  • ఉపాధి లేక కార్మికులు రోడ్డున పడుతున్నారు
  • నిర్మాణ రంగం కార్మికులను కాపాడండి
ఇసుక విధానంలో తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. ఇసుక విధానంలో తుది నిర్ణయం తీసుకోవడంలో జాప్యం వల్ల నిర్మాణ రంగంపైనే కాకుండా దాని అనుబంధ రంగాలపైనా తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు. ఉపాధి లేక లక్షల మంది కార్మికులు రోడ్డున పడుతున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి చేరుతుందని అభిప్రాయపడ్డారు. దయచేసి, వెంటనే ఇసుక విధానం ధరలను ఖరారు చేయాలని కన్నా కోరారు. ఇసుక విధానం ఖరారు చేసి నిర్మాణ రంగం కార్మికులను కాపాడాలని జగన్ కు కన్నా విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
cm
Jagan
BJP
kanna

More Telugu News