అప్పుడే నాకు సినిమాల్లోకి రావాలనిపించింది: ఆనంద్ దేవరకొండ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పుడే నాకు సినిమాల్లోకి రావాలనిపించింది: ఆనంద్ దేవరకొండ

  • నేను యూఎస్ లో జాబ్ చేసేవాడిని 
  • అన్నయ్య హీరోగా ఎదుగుతూ వచ్చాడు 
  • మా ఫ్యామిలీ ఆర్ధికంగా నిలబడిందన్న ఆనంద్ దేవరకొండ  
'దొరసాని' సినిమాలో శివాత్మిక జోడీగా ఆనంద్ దేవరకొండ కనిపించనున్నాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆనంద్ దేవరకొండ బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "నేను యూఎస్ వెళ్లి అక్కడ మంచి పేరున్న యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాను. ఆ తరువాత షికాగోలో మంచి జాబ్ సంపాదించాను.

అలా అక్కడ నేను జాబ్ చేస్తుండగా, ఇక్కడ హీరోగా మా అన్నయ్య ఎదుగుతూ వచ్చాడు. ఆర్ధికంగా మా ఫ్యామిలీ ఒక స్థాయికి చేరుకుంది. అదే సమయంలో అన్నయ్య హీరోగా వచ్చిన 'అర్జున్ రెడ్డి' భారీ విజయాన్ని అందుకుంది. నేను విజయ్ దేవరకొండ తమ్ముడిని కావడంతో, నన్ను కూడా ప్రత్యేకంగా చూడటం మొదలుపెట్టారు. దాంతో నాకు కూడా సినిమాల్లోకి రావాలనిపించింది. అన్నయ్యని అడిగితే 'నీ ఇష్టం' అన్నాడు. అలా 'దొరసాని' సినిమాతో నటుడిగా నా ప్రయాణం మొదలుపెట్టాను" అని చెప్పుకొచ్చాడు. 
Anand Devarakonda
Shivathmika

More Telugu News